శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 21, 2021 , 21:42:28

మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 2,886 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,878కు, మరణాల సంఖ్య 50,634కు పెరిగింది. 

మరోవైపు గత 24 గంటల్లో 3,980 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,03,408కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,622 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo