శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 11:43:33

ఊపిరాడని స్థితి.. ట్రక్కులలో రోజువారి కూలీల తరలింపు

ఊపిరాడని స్థితి.. ట్రక్కులలో రోజువారి కూలీల తరలింపు

ముంబయి : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రోజువారీ కూలీలు.. నగరాలు, పట్టణాల నుంచి తమ సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊపిరాడని స్థితిలో 300 మంది రోజువారి కూలీలను రెండు ట్రక్కుల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి 300 మంది కూలీలు రాజస్థాన్‌కు రెండు ట్రక్కుల్లో బయల్దేరారు. మహారాష్ట్ర యావత్మల్‌ జిల్లాలోని చెక్‌పోస్టు వద్ద ఆ రెండు ట్రక్కులను పోలీసులు ఆపారు. తెలంగాణ నుంచి రాజస్థాన్‌కు సరుకులు తరలిస్తున్నట్లు ట్రక్కు డ్రైవర్లు తెలిపారు. పోలీసులకు అనుమానం వచ్చి ట్రక్కులను తెరిచి చూడగా.. 300 మంది కూలీలు బయటపడ్డారు. కూలీలను తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


logo