మంగళవారం 31 మార్చి 2020
National - Feb 21, 2020 , 19:12:42

సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీల గురించి మోదీతో చర్చించాం: ఠాక్రే

సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీల గురించి మోదీతో చర్చించాం:  ఠాక్రే

న్యూఢిల్లీ:  సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీల గురించి  ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ఈ అంశాలపై ఇప్పటికే మా వైఖరి తెలియజేశామని ఠాక్రే అన్నారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో ఉద్ధవ్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి.  ఉద్ధవ్‌ తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా మోదీని కలిశారు. మోదీతో సమావేశం అనంతరం ఉద్ధవ్‌ మీడియాతో మాట్లాడారు. 

'సీఏఏపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు. సీఏఏ గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. సీఏఏ ప్రజల పౌరసత్వాన్ని హరించజాలదు. పొరుగుదేశాల్లోని మైనార్టీలకు సీఏఏ పౌరసత్వం కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు.' అని ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను అమలు చేస్తామని ఉద్ధవ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 


logo
>>>>>>