మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 14:59:40

మేము బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

మేము బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

న్యూఢిల్లీ:  శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్యను సందర్శించారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు.  రామ్‌ లల్లా ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకి వచ్చానని ఠాక్రే తెలిపారు. 'గత ఏడాదిన్నరలో నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను ఈ రోజు ప్రార్థనలు కూడా చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా, రామ మందిరం నిర్మాణం కోసం నా ట్రస్టు నుంచి కోటి రూపాయలను విరాళంగా ఇస్తాను. మేమే అసలైన హిందూవాదులం. బీజేపీ హిందుత్వాన్ని ఎప్పుడో విడిచిపెట్టింది. మేము బీజేపీకే దూరమయ్యాం కానీ.. హిందుత్వానికి కాదు. త్వరలో అయోధ్యలో అద్భుతమైన ఆలయం నిర్మాణం అవుతుందని' ఠాక్రే వివరించారు. logo