సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 10:59:57

మహారాష్ట్రలో మళ్లీ కొవిడ్‌ విజృంభణ..

మహారాష్ట్రలో మళ్లీ కొవిడ్‌ విజృంభణ..

ముంబై : మహారాష్ట్రలో దీపావళి తర్వాత కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పండుగకు ముందు రెండువేల నుంచి మూడువేల వరకు సగటున పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. తాజాగా ఐదువేల మార్క్‌ను దాటాయి. గురువారం ఒకే రోజు 5,535 కేసులు రికార్డు కాగా.. 150 మంది వరకు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం 5,011 కేసులు రికార్డు కాగా.. వంద మంది వరకు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 17,63,055 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు 16,35,971 మంది కోలుకున్నారు. 47,346 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం 79,738 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు తెరిచేందుకు, ప్రజలు పండుగలను జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత.. మహారాష్ట్రలో కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ సమయంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీజేపీ పార్టీ దీన్ని సమస్యగా మార్చి.. ఆలయాలు తెరిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీఎం కోరారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.