సోమవారం 06 జూలై 2020
National - Jun 28, 2020 , 10:50:50

మ‌హారాష్ర్ట‌లో తెరుచుకున్న హెయిర్ సెలూన్స్

మ‌హారాష్ర్ట‌లో తెరుచుకున్న హెయిర్ సెలూన్స్

ముంబై : మ‌హారాష్ర్ట వ్యాప్తంగా సుమారు 3 నెల‌ల త‌ర్వాత బార్బ‌ర్ షాపులు, సెలూన్స్ తెరుచుకున్నాయి. ఈ సంద‌ర్భంగా ఓ దుకాణ‌దారుడు మాట్లాడుతూ.. సెలూన్స్, బార్బ‌ర్ షాపుల ఓపెన్ కు ప్ర‌భుత్వం అనుమ‌తివ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. షాపులోని ప్ర‌తి ప‌ర‌క‌రాన్ని శానిటైజ్ చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి సెలూన్ ను శానిటైజ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 

అన్ని రాష్ర్టాలో సెలూన్స్ కు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ.. క‌రోనా విజృంభ‌ణ దృష్ట్యా మ‌హారాష్ర్ట‌లో అనుమ‌తివ్వ‌లేదు. సుమారు 3 నెల‌ల త‌ర్వాత అక్క‌డ సెలూన్స్ తెరుచుకుంటున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి హెయిర్ సెలూన్స్ దుకాణాల ఓపెన్ కు అనుమ‌తిచ్చారు. క‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆదేశించారు. అయితే కేవ‌లం హెయిర్ క‌టింగ్ కు మాత్ర‌మే అనుమ‌తిచ్చారు. షేవింగ్స్ కు అనుమ‌తివ్వ‌లేదు. దుకాణ య‌జ‌మాని, క‌స్ట‌మ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. లేని యెడ‌ల చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై శుక్ర‌వారం తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. 

ప్ర‌స్తుతం ముంబైలో 27,134 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు బృహ‌ణ్ ముంబై కార్పొరేష‌న్ అధికారులు నిన్న విడుద‌ల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు. logo