మంగళవారం 19 జనవరి 2021
National - Dec 22, 2020 , 08:19:25

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ

ముంబై : యూకేలో కరోనా వైరస్‌ కొత్త జాతి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుకానుండగా.. మంగళవారం నుంచి అమలులోకి రానుంది. అలాగే యూరోపియన్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణీకులు 14 రోజులు తప్పనిసరి సంస్థాగత నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే మహారాష్ట్రకు చేరిన ఐదు రోజు లేదంటే ఏడో రోజు తప్పనిసరిగా కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సీఎం ఉద్ధవ్‌ ఠాకే అధ్యక్షతన రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. వైరస్‌ కొత్త జాతి లక్షణాలుండే ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యూరప్‌, మిడిల్‌ఈస్ట్‌ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ హోం ఐసోలేషన్‌ తప్పనిసరి చేసింది. కొవిడ్‌ ముప్పు ఇంకా తీవ్రంగానే ఉందని సీఎం ప్రజలను హెచ్చరించారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు.