శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 07:07:25

భీవండిలో కుప్పకూలిన భవనం.. 8 మంది మృతి

భీవండిలో కుప్పకూలిన భవనం.. 8 మంది మృతి

బీవండి : మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 20 మందిని స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న  పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్నది స్పష్టంగా తెలియరాలేదు. భీవండీ పట్టణంలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. భవనంలో దాదాపు 21 ఫ్లాట్లు ఉన్నాయి. నివాసితులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo