గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 11:19:07

క్వారంటైన్‌ కేంద్రంలో మహిళపై లైంగికదాడి

క్వారంటైన్‌ కేంద్రంలో మహిళపై లైంగికదాడి

రాయ్‌ఘడ్‌ : మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌ జిల్లా పన్వేల్‌ క్వారంటైన్‌ కేంద్రంలో 40 ఏండ్ల మహిళపై లైంగికదాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. పన్వేల్‌ క్వారంటైన్‌ కేంద్రంలో 400 మందికిపైగా కరోనా పాజిటివ్‌ బాధితులు, అనుమానితులు ఉంటున్నారు. వీరిలో ఓ మహిళ(40)పై శుక్రవారం లైంగికదాడి జరిగిందని పోలీసులకు సమాచారం రావడంతో ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పన్వేల్‌ జోన్‌ -2 ఏసీపీ రవీంద్ర గీతే తెలిపారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణలో సరైన విధానం లేని కారణంగానే ఈ ఘటన జరిగిందని  బీజేపీ ఆక్షేపించింది. పలు క్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితులకు సకాలంలో భోజనం కూడా అందడం లేదని ఆరోపించింది. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని బీజేపీ ముఖ్యనాయకుడు రామ్‌కదమ్‌ ప్రశ్నించారు.


logo