మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 15:44:50

కొల్హాపూర్‌ జిల్లాలో తీవ్ర వరదలు

కొల్హాపూర్‌ జిల్లాలో తీవ్ర వరదలు

కొల్లాపూర్‌ : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా తీవ్ర వరదలు సంభవించడంతో జిల్లాలోని 34 రోడ్లు, 9 రాష్ట్ర రహదారుల గుండా వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రాజారాం డ్యాంలో నీటిమట్టం 41.10 అడుగులకు చేరి నిండుకుండను తలపిస్తోంది. డ్యాం హెచ్చరిక స్థాయి 39 అడుగులు కాగా ప్రస్తుతం రెండు అడుగులు అదనంగా నీరు చేరింది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే ప్రమాదకర స్థాయికి చేరినట్లేనని అధికారులు పేర్కొన్నారు.

ఇక్కడ నాలుగు జాతీయ విపత్తు ప్రతిస్పందనా బృందాలను మోహరించినట్లు తెలిపారు. జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వరద బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొల్హాపూర్‌తోపాటు సాంగ్లీ నది పరివాహన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాంగ్లీ జిల్లా పరిపాలనా యంత్రాంగం సూచించింది.


logo