శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 12:48:12

రైలు ప్రమాద మృతులకు రూ.5 లక్షలు నష్టపరిహారం

రైలు ప్రమాద మృతులకు రూ.5 లక్షలు నష్టపరిహారం

ముంబై: గుడ్స్‌ రైలు ప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. ఐదు లక్షలు చెల్లించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోని తమ సొంతరాష్ర్టాలకు వెళ్తున్న వలస కార్మికులు ఔరంగాబాద్‌ సమీపంలో గూడ్సు రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతిచెందగా, చాలా మంది గాయపడ్డారు. వీరి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఉద్ధవ్‌ థాక్రే, వలస కార్మికులు ఎట్టిపరిస్థితుల్లో తమ మనోైస్థెర్యాన్ని కోల్పోవద్దని, వీలైనన్ని ఎక్కువ రైళ్లు నడపడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. మృతులంతా జాల్నాలోని స్టీల్‌ కంపెనీలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 

ముంబైతోసహా, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి గత నాలుగైదు రోజుల్లో సుమారు లక్ష మంది వలక కార్మికులు తమ సొంత రాష్ర్టాలకు సురక్షితంగా చేరుకున్నారని వెల్లడించారు.


logo