బుధవారం 21 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 10:54:31

మహారాష్ట్రలో 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మహారాష్ట్రలో 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ముంబై : కరోనా నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ శివసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక అధికారుల సూచనల మేరకు అక్టోబర్‌ 5 నుంచి 50 శాతం వినియోగదారులకు మించకుండా హోటళ్లు, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, బార్ల నిర్వహణకు అనుమతించింది. ముంబై మెట్రోపాలిటన్‌, లోకల్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లోని డబ్బావాలాలు వ్యాపారం చేసుకునేందుకు ముంబై పోలీస్‌ కమిషన్‌ కార్యాలయం నుంచి క్యూఆర్‌ కోడ్‌లు పొందాలని సూచించింది.

అన్ని రైళ్లను తక్షణం ప్రారంభించి రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ప్రయాణం పరిమితం చేసింది. వివాహ వేడుకలకు 50శాతం అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, ఎడ్యుకేషన్‌, కోచింగ్‌ సంస్థలను అనుమతి నిరాకరించింది. మెట్రోరైళ్ల సమీపంలోని సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌ పార్కులు, థియేటర్లు( మాల్స్‌తోపాటు మార్కెట్‌ కాంప్లెక్సులు), ఆడిటోరియాలు, సమావేశ మందిరాలను నిషేధించింది. పూణేలో లోకల్‌ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.  దేశంలో కరోనాతో తీవ్రంగా ప్రభావమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo