బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు అరెస్ట్

నాగ్‌పూర్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 15 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత ఆగస్టు 8న నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఈ ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితుల్లో ఒకడైన హృతిక్ మోహిలే సోమవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లి బయటికి వెళ్దాం రమ్మని పిలవడంతో గొడవ జరిగింది. ఈ విషయమై ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా గత నెల నలుగురు కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని కూడా వెల్లడించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడైన యెష్ మెశ్రమ్ ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడేవాడని, గత నెల అతని మాట విని వెంట వెళ్లడంతో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.