మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 08:56:57

శ్రీన‌గ‌ర్‌లో భూకంపం.. 3.6 తీవ్ర‌త‌

శ్రీన‌గ‌ర్‌లో భూకంపం.. 3.6 తీవ్ర‌త‌

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముకశ్మీర్‌లో మ‌రోమారు భూకంపం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం రాత్రి 9.40 గంట‌ల‌కు  శ్రీన‌గ‌ర్‌, బుద్గాం, గందేర్బ‌ల్ స‌హా ప‌‌రిస‌ర జిల్లాల్లో భూమి కంపించింది. దీని తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. శ్రీన‌గ‌ర్ స‌మీపంలో భూఅంత‌ర్భాగంలో 5 కి.మీ. లోతులు భూమి కంపించించిద‌ని తెలిపింది. 

దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.  భూకంపం సందర్భంగా పెద్ద శబ్ధం వచ్చిందని స్థానికులు చెప్పారు. ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని జమ్మూకశ్మీర్ అధికారులు చెప్పారు.


logo