ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 07:39:30

అసోంలో మళ్లీ భూకంపం

అసోంలో మళ్లీ భూకంపం

దిస్పూర్‌: వరుస భూకంపాలు అసోం వణికిపోతున్నది. రాష్ట్రంలోని హైలాకుండీలో శనివారం తెల్లవారుజామున 4.25 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. 

శుక్రవారం రాత్రి 10.03 గంటలకు మిజోరంలోని చంపాయ్‌కి దక్షిణంగా 18 కి.మీ. దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.1గా నమోదయ్యిందని తెలిపింది. నిన్న ఉదయం జమ్ముకశ్మీర్‌లో కూడా భూమి కంపించింది. దీంతో భూమి కంపించినప్పుడల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 


logo