ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 16:54:36

కొత్త కోడలికి ఓ అత్త ఎలా స్వాగతం పలికిందో తెలుసా?

కొత్త కోడలికి ఓ అత్త ఎలా స్వాగతం పలికిందో తెలుసా?

చెన్నై: కొత్త కోడలికి ఓ అత్త వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి.. తినలేని పరిస్థితి.. మరి కొత్త కోడలు ఇంటికి వస్తోంది.. ఏం చేయాలి అని ఆలోచించిన ఆ అత్త ఏకంగా 101 రుచికరమైన వంటకాలను సిద్ధం చేసి, కోడలికోసం వడ్డించింది. 

తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన అహిలా అబుల్‌ కలాం అనే మహిళ కొడుకుకు పెళ్లి జరిగింది. కోడలు కొత్తగా ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించిన అహిలా మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, స్వీట్లు, తదితర 101 రుచికరమైన వంటకాలను వండి విస్తరిలో అందంగా అలంకరించింది. దీన్ని వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, వైరల్‌ అవుతున్నది. అత్తంటే ఇలా ఉండాలని నెటిజన్లు అభినందిస్తున్నారు. కింద ఉన్న వీడియోను మీరూ చూసేయండి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo