శనివారం 11 జూలై 2020
National - Jun 06, 2020 , 10:50:19

యూఎన్‌ఏడీఏపీ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బార్బర్‌ కూతురు

యూఎన్‌ఏడీఏపీ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బార్బర్‌ కూతురు

తమిళనాడు : యునైటెడ్‌ నేషన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌(యూఎన్‌ఏడీఏపీ) గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా మధురైకు చెందిన బార్బర్‌ కూతురు ఎం.నేత్ర(13) ఎంపికైంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోజువారి కూలీలు, వలస కార్మికులు తమ జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరి బాధలు చూసి చలించిన నేత్ర తన చదువు కోసం తండ్రి దాచిన రూ. 5 లక్షల నగదును పేదల సహాయం నిమిత్తం ఇచ్చేందుకు తండ్రిని ఒప్పించింది. నిరుపేదలను ఈ నగదుతో ఆదుకుంది. బాలిక దాతృత్వాన్ని ఆ రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు అభినందించారు. విద్యార్థినికి జయలలిత అవార్డును ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి పళనిస్వామికి సిఫార్సు చేశారు. 

కొన్ని రోజులక్రితం మన్‌ కీ బాత్‌ రేడియో ప్రొగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బాలికను, ఆమె తండ్రి మోహన్‌ను మెచ్చుకున్నారు. మధురైకు గర్వకారణమన్నారు. తన జీవితకాలం మొత్తం వెచ్చించి కూడబెట్టిన డబ్బులను పేదలకు పంచడం గొప్ప విషయమన్నారు. నేత్ర త్వరలోనే న్యూయార్క్‌లో జరిగే యూనైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌లో అదేవిధంగా జెనివాలో జరిగే సివిల్‌ సొసైటీ ఫోరం కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. 


logo