ఆదివారం 31 మే 2020
National - May 18, 2020 , 11:04:25

నాలుగు రోజుల పసికందును చంపిన తండ్రి

నాలుగు రోజుల పసికందును చంపిన తండ్రి

చెన్నై : ఆ చిన్నారి చేసిన పాపం.. ఆడబిడ్డగా పుట్టడమే. పురుడు పోసుకున్న నాలుగు రోజులకే ఆ బిడ్డను తండ్రి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు మధురైలోని సోలవందన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఇద్దరు దంపతులకు గత వారంలో ఓ ఆడబిడ్డ జన్మించింది. ఆడబిడ్డ కావడంతో.. తండ్రి, నానమ్మకు మనసులో మనసు లేదు. ఆ చిన్నారి వారికి భారంగా కనిపించింది. దీంతో ఆ పసిబిడ్డను చంపాలని తండ్రి, నానమ్మ నిర్ణయించుకున్నారు.

బిడ్డ పుట్టిన నాలుగు రోజులకే బ్రహ్మజెముడు పాలను త్రాగించారు. పాప ప్రాణాలు కోల్పోయింది. అయితే బిడ్డ అనారోగ్యంతో చనిపోయినట్లు తండ్రి నమ్మబలికాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించగా హత్యే అని తేలింది. ఈ కేసులు తండ్రితో పాటు నానమ్మను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 


logo