శుక్రవారం 10 జూలై 2020
National - Jun 22, 2020 , 14:49:30

ద‌ళితుడి హ‌త్య కేసులో మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దు చేసిన హైకోర్టు

ద‌ళితుడి హ‌త్య కేసులో మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దు చేసిన హైకోర్టు

హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులో 2016లో చోటుచేసుకున్న సంచ‌ల‌న ప‌రువు హ‌త్య కేసులో ఇవాళ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల క్రితం 23 ఏళ్ల‌ ద‌ళిత ఇంజినీరింగ్ విద్యార్థి శంక‌ర్‌ ..  19 ఏళ్ల కౌస‌ల్య‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కౌల‌స్య తండ్రి చిన్న‌స్వామి.. అల్లుడు శంక‌ర్‌ను హ‌త్య చేయించిన‌ట్లు ఆరోపించారు. 2017 డిసెంబ‌ర్‌లో ఆ కేసులో దిగువ స్థాయి కోర్టు ఆరుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది.  అయితే ఆ శిక్ష‌ను ర‌ద్దు చేస్తూ ఇవాళ మ‌ద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.  ఈ కేసులో కౌస‌ల్య తండ్రి చిన్న‌స్వామిని.. మ‌ద్రాసు హైకోర్టు నిర్ధోషిగా పేర్కొన్న‌ది.  మిగితా నేర‌స్థుల‌కు 25 ఏళ్ల‌ జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 

జ‌స్టిస్ ఎం స‌త్య‌నారాయ‌ణ‌ణ్‌, ఎం నిర్మ‌ల్ కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. చిన్న‌స్వామిని రిలీజ్ చేయాల‌ని బెంచ్ ఆదేశించింది. అత‌ను క‌ట్టిన జ‌రిమానాను కూడా తిరిగి చెల్లించాల‌న్న‌ది. ఇదే కేసు నుంచి చిన్న‌స్వామి భార్య అన్నాల‌క్ష్మీ, సోద‌రుడు పండిదురైల‌కు కూడా విముక్తి క‌ల్పించింది. నేర‌పూరిత కుట్ర‌, హ‌త్యా అభియోగాల‌ను చిన్న‌స్వామిపై నిరూపించ‌లేక‌పోయిన‌ట్లు బెంచ్ వెల్ల‌డించింది. 


logo