మంగళవారం 07 జూలై 2020
National - Jun 18, 2020 , 18:33:15

విష‌మంగానే మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం

విష‌మంగానే మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం

భోపాల్‌: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌క్నో‌లోని మేదాంత ఆస్ప‌త్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ చెప్పారు. ప్ర‌స్తుతం లాల్జీ టాండ‌న్ వెంటిలేటర్‌పై ఉన్నార‌ని, అయినా చికిత్సకు స్పందిస్తున్నార‌ని గురువారం మ‌ధ్యాహ్నం డాక్ట‌ర్‌ రాకేశ్ వెల్ల‌డించారు. టాండ‌న్ త్వరగా కోలుకోవాలని తామంతా ప్రార్థిస్తున్నామ‌ని చెప్పారు. ఆయ‌నను ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ద‌ని తెలిపారు. శ్వాస సంబంధ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న లాల్జీ టాండన్ ఈ నెల 11న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న‌ను ల‌క్న‌లోని మేదాంత ఆస్ప‌త్రిలో చేర్పించారు. అప్ప‌టి నుంచి ఆస్ప‌త్రిలోనే ఆయ‌న చికిత్స పొందుతున్నారు. 


logo