శనివారం 30 మే 2020
National - May 10, 2020 , 20:45:50

రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌: ఇద్ద‌రు మృతి,ఆరుగురికి గాయాలు

రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌: ఇద్ద‌రు మృతి,ఆరుగురికి గాయాలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌:  రాష్ట్రంలోని జ‌బ‌ల్పూర్ జిల్లాలోని ఘ‌న్షువ‌ర్వి గ్రామంలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామంలోని రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా, మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. త‌మ ప్రాంతంలో మేక‌లు మేపుతున్నార‌న్న కార‌ణంతో ఈ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఇరువైపులా ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు, గొడ్డ‌న్ల‌తో దాడులు చేసుకున్నారని బేదాఘాట్ పోలీస్‌స్టేష‌న్ అధికారి రీనాపాండే తెలిపారు. మృతులు ఖేమ్‌చంద్ యాద‌వ్‌(55), రామ్‌జీ యాద‌వ్‌(45)గాగుర్తించారు. నిందితుల‌పై హ‌త్య కేసు న‌మోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.  గాయ‌ప‌డిన వారిలో ముగ్గురి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.


logo