గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 22:28:08

మధ్యప్రదేశ్‌లో కరోనా కల్లోలం

మధ్యప్రదేశ్‌లో కరోనా కల్లోలం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆదివారం ఆ రాష్ట్రంలో కొత్తగా 874  కరోనా కేసులు నమోదు కాగా 12 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 27,800 కరోనా కేసులు నమోదు కాగా 19,132 మహమ్మారి బారినుంచి కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి కాగా 7,857 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 811 మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా దేశంలో ఇవాళ 48,661 కరోనావైరస్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 13,85,522 కు చేరింది. 4,67,882 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 8,85,577 మంది చికిత్సకు కోలుకొని డిశ్చారి అయ్యారు. 32,063 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ తెలిపింది.
 


logo