బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 20:53:51

ఇక ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఇక ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు

భోపాల్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఫిర్యాదులను ఫోన్‌  ద్వారా స్వీకరించి ఫిర్యాదుదారుడి ఇంటి వద్దకే వచ్చి అక్కడే ఎఫ్‌ఐఆర్‌ రాయాలని నిర్ణయించారు. ఎఫ్‌ఐఆర్‌ ఆప్‌కే ద్వార్‌ అనే ఈ వినూత్న కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరేత్తం మిశ్రా సోమవారం ప్రారంభించారు. ఈ పథకం రాష్ట్ర ప్రజలకు ఒక వరం లాంటిదని, ప్రజల సమస్యలను వారి ఇంటివద్దకే వచ్చి పోలీసులు  పరిష్కరించేలా ఈ పథకం సాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. 

తొలుత ఈ పథకాన్ని 11 డివిజన్ల పరిధిలోని 23 పోలీస్‌స్టేషన్లలో అమలుపరచాలని మధ్యప్రదేశ్‌ పోలీసులు నిర్ణయించారు. ఎవరైనా 100 డయల్‌కు ఫోన్‌ చేయగానే వారి సమస్యను తెలుసుకొని అవసరమైతే వారి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ రాసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆగస్ట్‌ 31 వరకు పైలట్‌ ప్రాజెక్టుగా ఈ  పథకాన్ని చేపట్టి, వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర  ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంగా పోలీస్‌, అంబులెన్స్‌, ఫైర్‌ విభాగాలు ఒక నంబర్‌లో అందుబాటులో ఉండేలా 112 డయల్‌ను హోంమంత్రి మిశ్రా ప్రారంభించారు. 


logo