మంగళవారం 31 మార్చి 2020
National - Mar 06, 2020 , 01:24:25

మధ్యప్రదేశ్‌లో ముదురుతున్న సంక్షోభం

మధ్యప్రదేశ్‌లో ముదురుతున్న సంక్షోభం
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గాయబ్‌

భోపాల్ల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్కార్‌ను కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలను బీజేపీ అపహరించిందని కాంగ్రెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేల్లో ఒకరైన హర్దీప్‌ దంగ్‌(కాంగ్రెస్‌ ఎమ్మెల్యే).. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ ఎన్పీ ప్రజాపతికి గురువారం ఓ లేఖను పంపారు. దీంతో మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మరోవైపు, హర్దీప్‌ దంగ్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రఘురాజ్‌ కాన్సానా, బిసౌలాల్‌ సింగ్‌, మరో స్వతంత్య్ర ఎమ్మెల్యే షెరా భైయా ఆచూకీ ఇంకా తెలియరాలేదని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. తమతో బీజేపీ బేరసారాలు జరిపిందన్న కాంగ్రెస్‌ ఆరోపణల్ని బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు.


logo
>>>>>>