సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 10:07:56

మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ మంత్రికి క‌రోనా

మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ మంత్రికి క‌రోనా

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ మంత్రి అర‌వింద్ భండోరియా క‌రోనా బారిన‌ప‌డ్డారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పిచ‌డంతో ఆయన ప‌రీక్షలు చేయించుకున్నారు. దీంతో గురువారం వెలువ‌డిన ఫ‌లితాల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ భోపాల్‌లోని ఓ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు కూడా అయిన భండోరియా బుధవారం జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. అదేవిధంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ అంత్య‌క్రియ‌ల్లో కూడా పాల్గొన్నారు.  

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 24842 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా క‌రోనాతో 770 మంది మ‌ర‌ణించారు. రాజ‌ధాని భోపాల్‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో జూలై 24 నుంచి ప‌దిరోజుల‌పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 


logo