గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 10, 2020 , 11:23:52

మధ్యప్రదేశ్‌ మంత్రికి కరోనా పాజిటివ్‌

మధ్యప్రదేశ్‌ మంత్రికి కరోనా పాజిటివ్‌

భోపాల్‌ : దేశాన్ని కరోనా వణికిస్తోంది. సామాన్యులతో పాటు వ్యాపారవేత్తలు, సినీ నటులు, ప్రజాప్రతినిధులతో మహమ్మారి బారినపడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా వైరస్‌ బారినపడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌కు కరోనా సోకింది. దీనిపై ఆయన ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘నేను రెండోసారి చేయించుకున్న కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. మొదటి కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాన‌ని’ పేర్కొన్నారు. తనను కలిసిన వారంతా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సారంగ్‌ సూచించారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కరోనా సోకగా, ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. మ‌రోవైపు మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 38,157 కరోనా పాజిటివ్‌ కేసులుండగా, 28,353 రికవరీ కేసులుండగా, మరో 977 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందారు.


తాజావార్తలు


logo