సోమవారం 06 జూలై 2020
National - May 26, 2020 , 11:27:06

భర్త క్వారంటైన్‌లో.. భార్య ప్రియుడితో..

భర్త క్వారంటైన్‌లో.. భార్య ప్రియుడితో..

భోపాల్‌ : భర్త క్వారంటైన్‌లో ఉండగా.. భార్య ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ముందేరి గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి.. కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో కూలీగా పని చేస్తున్నాడు సదరు వ్యక్తి. ఇతని భార్యా పిల్లలు కూడా ఢిల్లీలోనే ఉండేవారు. ఏడాదిన్నర క్రితం.. భార్యాపిల్లలు ముందేరికి తిరిగి రాగా, భర్త మాత్రం ఢిల్లీలోనే ఉన్నాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో సదరు వ్యక్తి సొంతూరికి రావాలని నిర్ణయించుకున్నాడు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైల్లో ఢిల్లీ నుంచి ఛత్తర్‌పూర్‌ జిల్లాకు మే 19న చేరుకున్నాడు. 

కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం.. ఆ వ్యక్తి తన ఇంట్లోని పై అంతస్తులో 14 రోజుల క్వారంటైన్‌లోకి వెళ్లాడు. భార్యాపిల్లలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే మే 24వ తేదీన భార్య ఎవరికీ చెప్పకుండా.. ప్రియుడితో వెళ్లిపోయింది. భర్త ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసింది. మొత్తానికి భర్త గది నుంచి బయటకు వచ్చి భార్య అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త ముఖానికి మాస్కు ధరించి తన భార్య ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. logo