బుధవారం 03 మార్చి 2021
National - Feb 23, 2021 , 16:37:14

పన్నాలో కార్మికులకు దొరికిన వజ్రాలు

పన్నాలో కార్మికులకు దొరికిన వజ్రాలు

భోపాల్‌ : అదృష్టం ఎవరికి, ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. కొంత మంది అదృష్టం వరించడానికి వివిధ సవాళ్లను అధిగమిస్తుండగా.. మరికొందరు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. అయితే, గని కార్మికులు తమ వృత్తిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా.. రెండు వజ్రాలు దొరికాయి. ఈ వజ్రాలను వేలం వేసేందుకు కలెక్టర్‌ చర్యలు తీసుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా గనులు వజ్రాలకు ప్రసిద్ధిగాంచినదిగా చెప్పుకుంటుంటారు. ఇక్కడ గతంలో పలు విలువైన వజ్రాలు లభించిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల కొందరు ఒక గనిలో తవ్వకాలు జరుపుతుండగా రెండు వజ్రాలు బయటపడ్డాయి. ఒకదాని బరువు 7.94 క్యారెట్లు ఉండగా.. మరొకటి 1.93 క్యారెట్లున్నది.  వెంటనే వీటిని జిల్లా కలెక్టర్‌ స్వాధీనపర్చుకున్నారు. వీటిని వచ్చే నెలలో వేలం వేసేందుకు అప్పుడే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. గనిలో తవ్వుతుండగా రెండు వజ్రాలు దొరికాయని గని కార్మికుడు భగవాండా కుష్వాహా తెలిపారు. ఆ సమయంలో అక్కడ నలుగురం పనిచేస్తున్నామని చెప్పారు. ఈ వజ్రాలు తమ కుటుంబాల సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నట్లు కుష్వాహా పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే బహుమతితో మా పిల్లల విద్యకు వెచ్చిస్తామని వారు వెల్లడించారు. 

భారతదేశంలోని తవ్వకాలు కొనసాగుతున్న ఏకైక వజ్రాల గని అయిన పన్నా జిల్లాకు విలువైన అన్వేషణల చరిత్ర ఉంది. 1961 లో జిల్లాలోని కచువా టోల్డ్ ప్రాంతంలో 44.55 క్యారెట్ల వజ్రం లభించింది. ఇటీవలే, పన్నా జిల్లాలో రూ.30 లక్షల-రూ.35 లక్షల విలువైన మూడు వజ్రాలు లభించిన తర్వాత ఒక కార్మికుడు రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారాడు. ఈ వజ్రాల నికర బరువు 7.5 క్యారెట్లు అని పన్నా జిల్లా వజ్రాల అధికారి ఆర్ కే పాండే తెలిపారు. 2018 లో కృష్ణ కల్యాణ్‌పూర్ పట్టి గ్రామం సమీపంలో బుందేల్‌ఖండ్‌కు చెందిన 50 ఏండ్ల కార్మికుడు మోతీలాల్ ప్రజాపతి రూ.1.5 కోట్ల విలువైన వజ్రాని దొరకబుచ్చుకున్నాడు. ఈ వజ్రం 42.9 క్యారెట్ల బరువుండి బుందేల్‌ఖండ్ జిల్లాలోని గనుల చరిత్రలో రెండవ అత్యధిక విలువైనదిగా గుర్తింపు పొందింది.

ఇవి కూడా చదవండి..

30 కోట్ల ఈ-మెయిల్‌ ఐడీలు లీక్‌..!

పింక్‌ బాల్ టెస్ట్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించేనా..?

వైర్లు లేకుండానే న్యూజిలాండ్‌లో విద్యుత్‌ సరఫరా..!

తొలిసారిగా అమలులోకి వచ్చిన ఐఎస్‌ఓ ధ్రువీకరణ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo