మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:26:39

విషం కలిపిన చపాతి తినడంతోనే..

విషం కలిపిన చపాతి తినడంతోనే..

  • మధ్యప్రదేశ్‌లో జడ్జి, కుమారుడు మృతి

భోపాల్‌, జూలై 30: చపాతీలు తిని ఓ జడ్జి, ఆయన కుమారుడు మరణించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. జడ్జి మహేంద్ర త్రిపాఠి చింద్వారా జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంధ్యాసింగ్‌ అనే మహిళ ఆయనతో పరిచయం పెంచుకున్నది. అయితే కొద్ది కాలానికే జడ్జి బేతుల్‌కు బదిలీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. 4 నెలల నుంచి జడ్జిని కలువడానికి కుదరకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన సంధ్యాసింగ్‌ న్యాయమూర్తి కుటుంబసభ్యులను చంపాలని కుట్ర పన్నింది. విషం కలిపిన పిండిని అందజేసింది. ఈ నెల 20న ఆ పిండితో చేసిన రొట్టెలను మహేంద్ర త్రిపాఠి, ఆయన ఇద్దరు కుమారులు తిన్నారు. తిన్న కాసేపటికే జడ్జి, కుమారుల్లో ఒకరు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని దవాఖానకు తరలించగా ఇద్దరు మృతిచెందారు. ఈ కేసులో సంధ్యాసింగ్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.logo