గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 01:29:48

మగువలకు మద్యం షాపులు

మగువలకు మద్యం షాపులు
  • మధ్యప్రదేశ్‌ సర్కార్‌ కొత్త ప్రణాళికలు

భోపాల్‌: మద్యం ద్వారా మరింత ఆదాయం కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మగువల కోసం ప్రత్యేక మద్యం షాపులను ఏర్పాటు చేయనున్నది. భోపాల్‌, ఇండోర్‌లో రెండు, జబల్‌పూర్‌, గ్వాలియర్‌లో ఒకటి చొప్పున త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. మాల్స్‌ లేదా సూపర్‌మార్కెట్‌ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మహిళా మద్యం ప్రియులు అమితంగా ఇష్టపడే వైన్‌, విస్కీ బ్రాండ్‌లను వీటిలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోని షాపింగ్‌ మాల్స్‌ ప్రాంతాల్లో ప్రత్యేక విదేశీ బ్రాండ్ల మద్యం షాపులను ఏర్పాటు చేసే యోచనలో సీఎం కమల్‌నాథ్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు.logo