శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 17:27:28

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ పరిస్థితి విషమం.. దవాఖానలో చేరిక

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ పరిస్థితి విషమం.. దవాఖానలో చేరిక

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ పరిస్థితి విషమం.. దవాఖానలో చేరిక

భోపాల్‌ : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను దవాఖానకు తరలించి వెంటిలేటర్‌ ద్వారా శ్వాసను అందిస్తున్నారు.  ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం పాడైపోయి పరిస్థితి విషమంగా ఉండగా వైద్యులు లక్నోలోని మెదాంత దవాఖౠనలో చేర్చారు. 

‘‘ఎంపీ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్లిష్టంగా ఉంది. అతడు వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. క్రిటికల్ కేర్ మెడిసిన్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు ”అని మెదాంత లక్నో డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన లాల్జీకి పైపు ద్వారా ఆహారం అందించడంతో ఆరోగ్యం నిలకడగానే ఉండేది. మరోసారి అతడి ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానకు తరలించారు. మూత్రవిసర్జనలో ఇబ్బందులతో పాటు తరచూ జ్వరం వచ్చినట్లుంటున్న నేపథ్యంలో జూన్ 11న అతడిని మొదటిసారి మెదాంతలో చేర్పించారు. తరువాత, అతను కాలేయం, మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo