మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 15:32:23

24 కి.మీ. మేర‌ సైకిల్ పై బ‌డికి.. ప‌ది ఫ‌లితాల్లో 98 శాతం మార్కులు

24 కి.మీ. మేర‌ సైకిల్ పై బ‌డికి.. ప‌ది ఫ‌లితాల్లో 98 శాతం మార్కులు

భోపాల్ : ఓ అమ్మాయి ప‌ది ప‌రీక్ష‌ల్లో నెగ్గేందుకు చాలా క‌ష్ట‌ప‌డింది. ప్ర‌తి రోజూ 24 కిలోమీట‌ర్లు.. సైకిల్ పై బ‌డికెళ్లి చ‌దువుకుని మంచి మార్కులు సంపాదించింది. అది కూడా టాప్ టెన్ లో నిలిచి ఔరా అనిపించుకుంది. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామానికి చెందిన రోష‌ణి భ‌దోరియా(15).. ప‌ది ఫ‌లితాల్లో 98.75 శాతం మార్కుల‌తో 8 ర్యాంకు సాధించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌ది ఫ‌లితాలు శ‌నివారం విడుద‌ల అయ్యాయి. 

ఈ సంద‌ర్భంగా రోష‌ణి మాట్లాడుతూ.. మాది వ్య‌వ‌సాయ కుటుంబం. నాన్న రైతు. నేను ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్థానికంగానే చ‌దువుకున్నారు. 9,10 త‌ర‌గ‌తుల‌కు వేరే ఊరు వెళ్లాల్సి వ‌చ్చింది. మా గ్రామం నుంచి ప్ర‌భుత్వ బాలిక‌ల పాఠ‌శాల 12 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. దీంతో నేనే స్వ‌యంగా సైకిల్ పై బ‌డికి వెళ్లొచ్చే దాన్ని. ఈ స‌మ‌యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప‌దో త‌ర‌గ‌తిలో క‌నీసం 70 సార్లు సైకిల్ పై స్కూల్ కు వెళ్లేదాన్ని. అప్పుడ‌ప్పుడు మా నాన్న బైక్ పై తీసుకెళ్లేవారు. అలా నా చ‌దువు కొన‌సాగింది. ఇప్పుడు 98 శాతం మార్కులు సాధించ‌డం సంతోషంగా ఉంది. భ‌విష్య‌త్ లో సివిల్ స‌ర్వీసెస్ సాధించాల‌న్న‌దే నా ఆకాంక్ష‌. ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌న్న‌దే నా కోరిక అని రోష‌ణి తెలిపారు.

98 శాతం మార్కులు సాధించిన రోష‌ణిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయులు.. రోష‌ణికి శుభాకాంక్ష‌లు తెలిపారు. 


logo