e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!

తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!

తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!

నీమూచ్: పెండ్లంటే మంత్రాలు.. బాజాభజంత్రీలు.. తప్పెట్ల మేళాలు.. మంత్రాలతో పురోహితుల దేవతార్చన.. వధూవరులు.. వారి కుటుంబ, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకునే సంరంభం… కానీ కరోనాతో మహా కష్టకాలమొచ్చింది.. ఓ తండ్రి తన కూతురు పెండ్లి ఘనంగా, అత్యంత విలాసవంతంగా చేయాలనుకున్నా, కరోనా ఆంక్షలు అడ్డమొచ్చాయి.

విలాసంగా కూతురు పెండ్లి చేయాలనుకున్నా

మధ్యప్రదేశ్‌లోని నీమూచ్ జిల్లా గ్వాల్ దెవియాన్ గ్రామ రైతు చంపాలాల్ గుర్జార్ అత్యంత విలాసవంతంగా తన కూతురు పెండ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం ఖర్చు చేయడానికి రూ.2 లక్షలు సిద్ధంగా పెట్టుకున్నారు.

సాదా సీదగా పెండ్లీ వేడుక

కానీ కరోనా ఆంక్షల నేపథ్యంలో శనివారం ఆ పెండ్లి సాదాసీదాగా చేసేశాడు. అంతటితో ఆగక గత కొన్ని రోజులుగా వెల్లువెత్తుతున్న కరోనా కొత్త కేసుల నేపథ్యం చంపాలాల్ గుర్జార్ గుండెను కలచివేసింది.

కొవిడ్-19 రోగుల కొసం బిడ్డ పెండ్లి ఖర్చు డొనేషన్

అంతే ఆ రూ.2 లక్షల నగదును కొవిడ్-19 వల్ల ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న రోగులకు చికిత్సనందించేందుకు ఆక్సిజన్ కొనుగోలు చేయాలని అధికారులకు విరాళంగా ఇచ్చేశారు.

ఉబ్బితబ్బిబవుతున్న అనీత

జిల్లా కేంద్ర దవాఖానకు ఒకటి, మరొకటి జీరాన్ తహసీల్ దవాఖానకు మరొక ఆక్సిజన్ సిలిండర్ కొనిపెట్టాలని కోరారు చంపాలాల్ గుర్జార్. తండ్రి దాత్రుత్వ గుణంతో కూతురు అనిత ఉబ్బితబ్బిబవుతున్నది. ప్రస్తుత తరుణంలో కొవిడ్ కేసులను తగ్గించడానికి రోగులకు మెడికల్ ఆక్సిజన్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆధుకునేందుకు గుర్జార్ వంటి రైతులున్నారు

చంపాలాల్ గుర్జార్ వంటి రైతును ఆదర్శంగా తీసుకుని కరోనా రోగులకు ఆదుకునేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ అగర్వాల్ తెలిపారు. ఇంతకుముందు ముంబై వాసి షానావాజ్ షేక్ తన రూ.22 లక్షల ఎస్ యూవీ మోడల్ ఫోర్ ఎండోవర్ కారును విక్రయించి రోగుల కోసం 160 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడంలో సాయపడ్డారు.

హమీర్ పూర్ లో వ్యాపారి రోజూ వెయ్యి సిలిండర్ల రీఫిల్లింగ్

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ వాసి మనోజ్ గుప్తా అనే వ్యాపారి రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ల రీఫిల్లింగ్ చేయిస్తున్నారు. కరోనాతో తాను ఎదుర్కొన్న బాధ ఏమిటో తెలుసునని, రోజుకు 1000 సిలిండర్లను రూపాయికే చెల్లించి ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు.

తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!

ఫ్రీ వ్యాక్సినేషన్‌కు కేరళ బీడీ కార్మికుడి రూ.2 లక్షల విరాళం

కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన జనార్దన్ అనే అనే బీడి కార్మికుడు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు తన పొదుపు ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విపత్తు నివారణ సంస్థకు నివేదించారు.

పొదుపు మొత్తం ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోళ్లకే

ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేసి తన దాత్రుత్వాన్ని మరోమారు దాచుకోలేకపోయారు. ఇప్పుడు జనార్ధన్ వద్ద కేవలం రూ.850 మాత్రమే ఉంటుందట.

టీకా సరఫరా ధర పెంపుపై జనార్ధన్ ఆందోళన

టీవీ వార్తల్లో రాష్ట్రాలకు కొవాషీల్డ్ టీకా సరఫరా దర రూ.400కు పెంచడమేటని ఆందోళనకు గురయ్యారు. ఆ మరునాడే తన వద్ద పొదుపు చేసిన మొత్తం ఆక్సిజన్ సిలిండర్లను కోనుగోలు చేయవచ్చునని జనార్దన్.. సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

కరోనాతో ఎకానమీ డౌన్‌

పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్‌ వీడియో

భార‌త్ మ‌మ్మ‌ల్ని వ్యాక్సిన్లు అడ‌గ‌లేదు: అమెరికా

త‌రుణ్ తేజ్‌పాల్‌పై అత్యాచార ఆరోప‌ణ‌ల కేసు.. విచార‌ణ మే 12కు వాయిదా

అఫీషియ‌ల్‌: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్ర‌క‌టించిన నిర్మాణ సంస్థ‌

భార‌త్ మ‌మ్మ‌ల్ని వ్యాక్సిన్లు అడ‌గ‌లేదు: అమెరికా

vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు క‌రోనా టీకా కోసం ఇలా రిజిస్ట‌ర్ చేసుకోండి

సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు

కేజీ-డీ6 శాటిలైట్‌ క్లస్టర్‌లో ఉత్పత్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!

ట్రెండింగ్‌

Advertisement