బుధవారం 27 జనవరి 2021
National - Dec 26, 2020 , 14:55:31

కాంగ్రెస్ శ్రేణులూ నిద్ర లేవండి: దిగ్విజ‌య్ సింగ్‌

కాంగ్రెస్ శ్రేణులూ నిద్ర లేవండి: దిగ్విజ‌య్ సింగ్‌

భోపాల్‌: ‌కేంద్ర స‌ర్కారు ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్ సింగ్ మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల ద్వారా కేంద్రం రైతుల‌కు అన్యాయం చేసింద‌ని, అందుకే హ‌ర్యానా, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రైతులు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నార‌ని దిగ్విజ‌య్ పేర్కొన్నారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతులు అమాయ‌కుల‌ని, అయితే వారికి వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌వ‌ల్ల న‌ష్టాల గురించి వివ‌రించి చైత‌న్యప‌ర్చ‌‌కుండా కాంగ్రెస్ శ్రేణులు నిద్ర‌పోతున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ శ్రేణులు మేల్కొని ఉద్య‌మంలో చేరాల‌ని, వ్యవ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించాల‌ని దిగ్విజ‌య్ పిలుపునిచ్చారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo