బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 19:09:06

మధ్యప్రదేశ్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

మధ్యప్రదేశ్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే  రాజీనామా

భోపాల్: మధ్యప్రదేశ్‌లో మరో కాంగ్రెస్ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమిత్రా దేవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రొటెమ్ స్పీకర్ రామేశ్వర్ శర్మకు సమర్పించగా ఆయన అంగీకరించారు. మరోవైపు ఈ ఘటన తనను ఆశ్చర్యపర్చలేదని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. మరికొంత మంది పార్టీని వీడవచ్చని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఎరవేసి ఆకర్షిస్తున్నారని కమల్‌నాథ్ విమర్శించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నదని ఆయన ఆరోపించారు.


logo