గురువారం 16 జూలై 2020
National - Jun 26, 2020 , 16:48:04

చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి ఆశ్రమాన్ని గురువారం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1003 సంవత్సరాల క్రితమే శ్రీరామానుజాచార్యులు మేథోపరంగా సరళమైన మత బోధనలను వ్యాప్తి చేశారన్నారు. అనంతరం చిన్నజీయర్‌ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

  ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ఇది చాలా క్లిష్టసమయమైన సమయం. కరోనా విజృంభణతో ఓవైపు దేశం మొత్తం బాధపడుతోందని, మరోవైపు సరిహద్దులో భారత్‌పై దాడి చేసేందుకు చైనా సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీకి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. అదే సమయంలో ఎవరికి వారు తమ బాధ్యతలను, విధులను నిర్వర్తించాలి. ప్రతి రాష్ట్రం అభివృద్ధిలో పురోగమించాలని, ప్రజాసంక్షేమం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వీటిని సాధించేందుకు తామూ శక్తివంచన లేకుండా పని చేస్తామని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వచనం తీసుకుంటే మన శక్తి రెట్టింపు అవుతుందని, దేశం కూడా ఇలాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడుతుందన్నారు.


logo