మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 16:10:21

ఆ రాష్ట్ర సీఎంకు కరోనా ఆందోళనలో మంత్రులు, అధికారులు

ఆ రాష్ట్ర సీఎంకు కరోనా ఆందోళనలో మంత్రులు, అధికారులు

భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇటీవల ఆయన్ను కలిసిన వారందరు ఆందోళన పడుతున్నారు. ప్రతినిత్యం కట్టుదిట్టమైన భద్రతతో ఉండే ముఖ్యమంత్రి కి కరోనా పాజిటివ్ రావడం తో మధ్యప్రదేశ్ లోని మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారు వణికి పోతున్నారు. తనతో ఇన్ని రోజులు ఎవరెవరు టచ్ లో ఉన్నారో ప్రతిఒక్కరు కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రెండు రోజుల క్రితమే సీఎం చౌహాన్ సీనియర్ మంత్రులతో సమావేశం కావడంతో మంత్రులకు కరోనా కలవరం మొదలైయ్యింది. శివరాజ్ సింగ్ చౌహాన్ స్వల్ప అనారోగ్యానికి గురావడంతో ఓ కార్యక్ర మాన్ని కూడారద్దు చేసుకు న్నారు. తరువాత కరోనా లక్షణాలు కనపడటంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు అనుమానం వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వైద్యపరీక్షల్లో  ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది.


logo