గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 12:35:55

మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు క‌రోనా పాజిటివ్‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు క‌రోనా పాజిటివ్‌

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. 'ప్ర‌జ‌లారా! నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నా. ఆ ప‌రీక్ష‌ల్లో నాకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. కాబ‌ట్టి ఈ మ‌ధ్య న‌న్ను క‌లిసిన స‌హ‌చ‌రులంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోండి. నాతో స‌న్నిహితంగా మెలిగినవాళ్లు త‌ప్ప‌నిస‌రిగా క్వారెంటైన్‌లో ఉండండి' అని శివరాజ్‌సింగ్ కోరారు.         

మార్చి 25 నుంచి ప్ర‌తిరోజు సాయంత్రం తాను రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై స‌మీక్ష‌ జ‌రుపుతున్నాన‌ని, ఇప్పుడు కూడా సాధ్య‌మైనంత‌వ‌ర‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశాల్లో పాల్గొంటాన‌ని శివ‌రాజ్‌సింగ్ చెప్పారు. తాను లేక‌పోయినా, హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా, గ్రామీణాభివృద్ధి, ప‌రిపాల‌నా శాఖ మంత్రి భూపేంద్ర‌సింగ్‌, ఆరోగ్య విద్యామంత్రి విశ్వాస్ సారంగ్‌, ఆరోగ్య‌మంత్రి ప్ర‌భురామ్ చౌద‌రి స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo