ఆదివారం 24 జనవరి 2021
National - Jan 01, 2021 , 19:56:39

రెండురోజుల్లో మరోమారు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ

రెండురోజుల్లో మరోమారు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌ విస్తరణకు సిద్ధమయ్యారు. ఆదివారం ఆయన తన మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది మార్చిలో నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గాని విస్తరించడం ఇది మూడోసారి.  ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మంత్రి వర్గ విస్తరణ అనంతరం  ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మహ్మద్‌ రఫిక్‌ 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న యూపీ గవర్నర్‌ ఆనంద్ ‌బెన్‌ పటేల్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మహ్మద్‌ రఫిక్‌ గతంలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. గత నెల 31న ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.  గతేడాది నవంబర్‌ 3న మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు  ఉప ఎన్నికలు జరిగాయి.  బీజేపీ 19 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. నాటి నుంచి పార్టీ తరఫున విజయం సాధించిన వారు మంత్రి వర్గంలో చోటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo