బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 13:38:58

భార్య‌ను కొట్టిన వీడియో వైర‌ల్.. ఉద్యోగం కోల్పోయిన ఉన్న‌తాధికారి

భార్య‌ను కొట్టిన వీడియో వైర‌ల్.. ఉద్యోగం కోల్పోయిన ఉన్న‌తాధికారి

భోపాల్‌: భార్య‌ను కొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ పోలీస్ ఉన్న‌తాధికారి విధుల నుంచి వైదొలిగాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ఏడీజీ) ఆఫ్ పోలీస్‌గా ప‌నిచేస్తున్న పురుషోత్తం శ‌ర్మ త‌న భార్య‌ను కొడుతున్న వీడియో ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఉద్యోగం నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఈ విష‌యంపై స్పందించిన పురుషోత్తం శ‌ర్మ తానేమీ నేర‌గాడిని కాద‌ని, అది త‌మ కుటుంబ గొడ‌వ అని చెప్పుకొచ్చారు. 

ఈ విష‌యంలో ఏడీజీ పురుషోత్తం శ‌ర్మ మాట్లాడుతూ.. మాకు 32 ఏండ్ల క్రితం వివాహం జ‌రిగింది. 20 ఏండ్ల త‌ర్వాత 2008లో ఆమె నాపై ఫిర్యాదు చేసింది. ఇంకో విష‌యం ఏమిటంటే 2008లో త‌న‌పై ఫిర్యాదు చేసిన‌ప్ప‌టి నుంచి కూడా ఆమె నా ఇంట్లోనే ఉంటున్న‌ది. అన్ని ర‌కాల సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్న‌ది. నా ఖ‌ర్చులో విదేశాల‌కు వెళ్లివ‌చ్చింది. నేను నిజం నేర స్వ‌భావం క‌లిగిన వాడినే అయితే ఆమె 2008కి ముందే నాపై ఫిర్యాదు చేసేది. ఇది కేవ‌లం మా కుటుంబ త‌గాదే త‌ప్ప నేరం కాదు. నేను నేరగాడిని కాదు. దుర‌దృష్ట‌వశాత్తు నేను స‌మ‌స్య‌లో చిక్కుకున్నా. నా భార్య ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇలా ఇరికించింది అని చెప్పారు.         

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo