సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 18:26:19

బోరుబావిలో పడిన మూడేండ్ల బాలుడు

బోరుబావిలో పడిన మూడేండ్ల బాలుడు

భోపాల్‌: మూడేండ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లా పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురబారా గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రహ్లాద్‌ అనే మూడేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన అధికారులు ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేపట్టారు. ఆర్మీ సిబ్బందిని ఘటనా స్థలానికి రప్పించారు. రెస్క్యూ సిబ్బంది ఆ బాలుడి గొంతును విన్నట్లు నివారి జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. బాలుడ్ని బోరుబావి నుంచి వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.కాగా, సైన్యంతోపాటు స్థానిక అధికారులు బాలుడు ప్రహ్లాద్‌ను రక్షించేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. ఆ చిన్నారిని త్వరగా వెలికితీస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. దేవుడు ఆ బాలుడికి దీర్ఘాయువు ఇవ్వాలని, దీని కోసం మనమంతా ప్రార్థనలు చేద్దామంటూ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.