బుధవారం 08 జూలై 2020
National - Jun 16, 2020 , 16:14:21

దేశీయ వెంటిలేటర్లు సిద్ధం.. దవాఖానలకు సరఫరా

దేశీయ వెంటిలేటర్లు సిద్ధం.. దవాఖానలకు సరఫరా

న్యూఢిల్లీ: మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా దేశంలో తయారు చేసిన వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న పలు రాష్ట్రాల దవాఖానలకు తొలి విడతగా 3,000 దేశీయ వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనే కరోనా రోగులకు వెంటిలేటర్లు ఎంతో అవసరమవుతాయి. కాగా, జూన్‌ నాటికి 75 వేల వెంటిలేటర్లకు డిమాండ్‌ ఉంటుందని, ఆ మేరకు వాటిని సమకూర్చుకునేందుకు ఆర్డర్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మే 1న మీడియాతో అన్నారు.

ఈ నేపథ్యంలో పలు దేశీయ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ సంస్థ స్కాన్‌రేతో కలిసి 30 వేల వెంటిలేటర్లను తయారు చేస్తున్నదని చెప్పారు. ఇతర దేశీయ సంస్థలైన ఏజీవీఏకు 10 వేలు, ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు 13,500, జోత్యి సీఎన్‌సీకి 5 వేల వెంటిలేటర్ల చొప్పున ఆర్డర్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తం 50 వేల వెంటిలేటర్ల కొనుగోలుకు పీఎంకేర్స్‌ నిధి నుంచి సుమారు రెండు వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలకు కూడా వెంటిలేటర్ల సరఫరాకు ఆర్డర్‌ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. చైనా నుంచి పది వేల వెంటిలేటర్ల కొనుగోలుకు సరఫరాదారులను సంప్రదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. logo