శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 30, 2020 , 12:43:42

శాశ్వ‌తంగా మూత‌ప‌డిన మేడ‌మ్ టుస్సాడ్స్‌!

శాశ్వ‌తంగా మూత‌ప‌డిన మేడ‌మ్ టుస్సాడ్స్‌!

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్టాత్మ‌క మేడ‌మ్ టుస్సాడ్స్ ఢిల్లీలోని క‌న్నాట్ ప్లేస్‌లో ఉన్న త‌న మ్యూజియాన్ని శాశ్వ‌తంగా మూసివేసింది. ఈ మైన‌పు విగ్ర‌హాల మ్యూజియాన్ని లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి నెల‌లో తాత్కాలికంగా మూసేసిన మేడ‌మ్ టుస్సాడ్స్‌.. ఇప్పుడిక దీనిని మ‌ళ్లీ తెర‌వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఈ మ్యూజియం నిర్వ‌హ‌ణ సంస్థ మెర్లిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇండియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అన్షుల్ జైన్ వెల్ల‌డించారు. క‌న్నాట్‌ప్లేస్ చాలా ఇరుకుగా ఉన్న కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇప్పుడీ మ్యూజియాన్ని మ‌రింత విశాల‌మైన ప్ర‌దేశంలో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఒక‌వేళ ఢిల్లీ ఎన్సీఆర్‌లో స‌రైన స్థ‌లం లేక‌పోతే ఇండియాలో మ‌రెక్క‌డైనా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్న‌ట్లు అన్షుల్ చెప్పారు. ఈ మ్యూజియంలో ప్ర‌స్తుతం 50 మంది ప్ర‌ముఖ‌ల మైన‌పు విగ్ర‌హాలు ఉన్నాయి. అందులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుక్ ఖాన్‌, మైకేల్ జాక్స‌న్‌, లేడీ గాగా, మ‌హాత్మా గాంధీ, న‌రేంద్ర మోదీ, కోహ్లిలాంటి వాళ్లు ఉన్నారు.


logo