మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 21:10:00

సీఎం మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని 9 గంట‌లు ప్ర‌శ్నించిన ఎన్ఐఏ

సీఎం మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని 9 గంట‌లు ప్ర‌శ్నించిన ఎన్ఐఏ

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌ను కుదిపేసిన బంగారం స్మ‌గ్లింగ్ కేసులో సీఎం విజ‌య‌న్ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం శివ‌శంక‌ర్‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమ‌వారం ప్ర‌శ్నించారు. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, కోచిలోని త‌మ కార్యాల‌యానికి రావాల‌ని ఇటీవ‌ల ఆయ‌న‌కు నోటీసు పంపింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం హాజ‌రైన శివ‌శంక‌ర్‌ను ఎన్ఐఏ అధికారులు సుమారు 9 గంట‌ల‌పాటు ప్ర‌శ్నించారు. అనంత‌రం ఆయ‌న అక్క‌డి నుంచి కారులో వెళ్లిపోయారు. అయితే శివ‌శంక‌ర్‌ను మంగ‌ళ‌వారం కూడా ప్ర‌శ్నించ‌నున్నారు. దుబాయ్ నుంచి కేర‌ళ‌కు దౌత్య‌మార్గంలో బంగారం అక్ర‌మ ర‌వాణాకు సంబంధించిన కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స్వ‌ప్న సురేశ్ తో ఆయ‌న‌కు సంబంధాలున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో శివ‌శంక‌ర్‌ను కూడా ఎన్ఐఏ ప్ర‌శ్నిస్తున్న‌ది. 


logo