మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 01:16:21

ప్రయాణికుల ఇంటి వద్దకు లగేజీ!

ప్రయాణికుల ఇంటి వద్దకు లగేజీ!

  • ‘బ్యాగ్స్‌ ఆన్‌ వీల్స్‌' సేవలకు రైల్వే శ్రీకారం

న్యూఢిల్లీ: ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల లగేజీని స్టేషన్‌ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్టేషన్‌ వద్దకు చేరవేసేందుకు ‘బ్యాగ్స్‌ ఆన్‌ వీల్స్‌' (బీవోడబ్ల్యూ) పేరిట వినూత్న సర్వీసులను ప్రారంభించింది. త్వరలో ఢిల్లీ, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌లలో ఈ సేవలు మొదట అందుబాటులోకి రానున్నాయి. బీవోడబ్ల్యూ  యాప్‌ ఆధారంగా సేవలను అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ అప్పగించినట్లు నార్తర్న్‌ రైల్వే శుక్రవారం వెల్లడించింది.  దూరం, లగేజీ పరిమాణం, లగేజీ బరువుపై చార్జీలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. వినూత్న పద్ధతుల ద్వారా రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు నార్తర్న్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ రాజీవ్‌ చౌధురి తెలిపారు.