National
- Dec 05, 2020 , 01:03:43
మతాంతర వివాహాన్ని అడ్డుకున్న లక్నో పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో లక్నో పోలీసులు శుక్రవారం ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు. సదరు జంట లీగల్ ప్రక్రియను పూర్తిచేయకపోవడంతోనే వారి పెండ్లిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. వధూవరుల కుటుంబాలను స్టేషన్కు పిలిపించి, కొత్త చట్టం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో వారు పెండ్లిని వాయిదా వేసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం.. సదరు జంట మతం మారకుండానే వివాహం చేసుకోవాలనుకుంటే, ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ చేసుకుని పెండ్లి చేసుకోవచ్చు. మతం మారాలనుకుంటే మాత్రం 60 రోజుల ముందుగానే సంబంధిత జిల్లా కలెక్టర్కు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
తాజావార్తలు
MOST READ
TRENDING