గురువారం 04 జూన్ 2020
National - Jan 16, 2020 , 13:43:06

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ : 50 మందికి పైగా గాయాలు

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ : 50 మందికి పైగా గాయాలు

భువనేశ్వర్‌ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. నిర్గుండి వద్ద ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. దీంతో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


logo