శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 02:56:58

వచ్చే నెలలో వంట గ్యాస్‌ ధరలు తగ్గొచ్చు

వచ్చే నెలలో వంట గ్యాస్‌ ధరలు తగ్గొచ్చు
  • కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

రాయ్‌పూర్‌, ఫిబ్రవరి 20: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు వచ్చే నెలలో తగ్గుముఖం పట్టే అవకాశముందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘గ్యాస్‌ సిలిండర్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయని అనడం సరికాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుతుంటాయి. ఈ నెలలో కూడా ఈ కారణంతోనే ధరలు పెరిగాయి. అంతేగాక శీతాకాలంలో గ్యాస్‌ వినియోగం పెరుగుతుంది. ఇది కూడా అంతర్జాతీయ మార్కెట్‌పై ఒత్తిడి పడటానికి ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులను పరిశీలిస్తుంటే వచ్చే నెలలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తున్నది’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.


logo