మంగళవారం 19 జనవరి 2021
National - Dec 23, 2020 , 13:47:15

వారానికోసారి సిలిండ‌ర్ ధ‌ర‌లో మార్పు!

వారానికోసారి సిలిండ‌ర్ ధ‌ర‌లో మార్పు!

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ను వ‌చ్చే ఏడాది నుంచి ప్ర‌తి వారం స‌వ‌రించాల‌ని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం వీటి ధ‌ర‌ల‌ను నెల రోజుల‌కోసారి స‌వ‌రిస్తున్నారు. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప్ర‌తి రోజూ ధ‌ర‌ల్లో మార్పు వ‌స్తుండ‌టం వ‌ల్ల తాము నెల మొత్తం న‌ష్ట‌పోతున్నామ‌ని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజూ మారుస్తుండ‌టం వ‌ల్ల వాటి న‌ష్టాల నుంచి కంపెనీలు గ‌ట్టెక్కాయి. ఇప్పుడు సిలిండ‌ర్‌ను కూడా వారం రోజుల‌కు ఓసారి స‌వ‌రించి త‌మ న‌ష్టాల‌ను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నాయి. 

ఇప్ప‌టికే మొద‌లుపెట్టాయి

నిజానికి ఇప్ప‌టికే దీనిని అమ‌లు చేయ‌డం కూడా ప్రారంభించాయి. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం చేయ‌లేదు. డిసెంబ‌ర్‌లో ఇప్ప‌టికే రెండుసార్లు ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం. డిసెంబ‌ర్ 2న స‌బ్సిడీ సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెర‌గ‌గా.. డిసెంబ‌ర్ 15న మ‌రోసారి అంతే మొత్తం పెరిగింది. ఇప్పుడు వారానికోసారి ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తే.. సిలిండ‌ర్ బండ మ‌రింత భారంగా మార‌డం ఖాయం. మ‌రి పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం స‌బ్సిడీని కూడా పెంచుతుందా లేదా అన్న‌ది చూడాలి.


ఇవి కూడా చ‌ద‌వండి

గుప్కార్ కూట‌మి ఏంటి? ఆ పేరెలా వ‌చ్చింది?

క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ

600 డాల‌ర్లు కాదు.. ఒక్కొక్క‌రికి 2వేల డాల‌ర్లు ఇవ్వండి

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు: బీజేపీ