బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 02:27:06

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

న్యూఢిల్లీ, మే 13: బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. త్వరలో ఇది వాయుగుండంగా మారి తుఫాన్‌ సంభవించనుంది. అయితే ప్రస్తు తం ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నైరుతి రుతుపవనాల రాకపై పడనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర మాట్లాడుతూ నైరుతి రుతుపవనాలు ఈ నెల 16న అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకనున్నాయని తెలిపారు.


logo